TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజంపేట 'దేశం'లో రగులుతున్న వివాదం

Published on: Tue Mar 20, 2012 2:25PM

త్వరలో ఉప ఎన్నికలు జరుగబోతున్న కడపజిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని ఒక వర్గం కోరుతుండగా ఆయనకు టిక్కెట్ ఇస్తే సహించేది లేదని మరోవర్గం బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. మదన్ మోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బిసి నేత శ్రీనివాసులు, ఎద్దుల వెంకటేశ్వర్లు, తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి, మోదుగుల కళావతమ్మ, ఇంజనీరింగ్ కళాశాల అధినేత పెంచలయ్య, ఎం.వి. రమణ తదితరులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గతంలో తనకు టిక్కెట్ ఇవ్వలేదనే కోపంతో పార్టీకి దూరంగా వున్న మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య మరోసారి టిడిపి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో తెలుగుదేశంలోని కుమ్ములాటలు మరింత పెరిగాయి. బ్రహ్మయ్యకు టిక్కెట్ ఇస్తే సహించబోనని మదన్ మోహన్ రెడ్డి, ఆయన వర్గీయులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశం అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై స్థానిక టిడిపి నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.