పోలీసుల అదుపులో సన?
Published on: Sun Nov 8, 2015 2:05PM

కాంగ్రెస్ నాయకుడు, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మృతి కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తు్న్నారు. ఈ కేసులో ఏ4 నిందితురాలిగా వున్న సనను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. సారిక భర్త అనిల్ రెండో భార్య సన. సారిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత రాజయ్య, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే సన మాత్రం పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని వెళ్ళిపోవడం జరిగింది. సన ఖమ్మంలో వున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.


