Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజా సింగ్… రాజుకుంటున్న కాషాయ ఫైర్ బ్రాండ్
posted on: Apr 10, 2017 12:46PM
.jpg)
బీజేపి అధికార చిహ్నం … కమలం! కమలానికి చాలా రెక్కలుంటాయి! అవ్వి ఒక్కోటి ఒక్కో సైజులో, రూపంలో వుంటూ వుంటాయి! ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కమలదళ నాయకులు కూడా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వ్యూహం అమలు చేస్తుంటారు! ఒకవైపు మోదీ, పారికర్, దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వారు అభివృద్ధి అంటూ మత సంబంధమైన విషయాలకు దూరంగా వుంటే… మరో వైపు గిరిరాజ్ కిషోర్, సాక్షి మహారాజ్ లాంటి వారు వీలైనప్పుడల్లా హిందూత్వ కామెంట్స్ చేస్తూ బోలెడంత కలకలం రేపుతుంటారు. తాజాగా వారి జాబితాలో చేరిపోయాడు మన తెలుగు కాషాయ ఎమ్మెల్యే రాజా సింగ్!
రాజా సింగ్ ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే. ఆయన ఒంటరిగా ఎంఐఎం ను ఎదుర్కుంటూ వుంటాడని చాలా మంది అభిప్రాయం. క్షేత్రస్థాయిలో కూడా హిందువులకు ఎప్పుడూ అందుబాటులో వుంటాడని చెప్పుకుంటారు. అందుకే, ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. రేపో మాపో అమిత్ షా హైద్రాబాద్ పై , తెలంగాణ పై దృష్టి పెడితే రాజా సింగ్ కీలకమయ్యే అవకాశాలు కూడా వున్నాయి. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ లాంటి సాఫ్ట్ లీడర్ కాదు రాజా భాయ్! కరుడుగట్టిన హిందూత్వవాది. బీజేపి వారికి ఉత్తరాదిలో వుండే అనేక మంది కట్టర్ హిందూ నాయకుల లాంటి మాస్ లీడర్! అదే ముందు ముందు రాజా సింగ్ కు రాజా యోగం పట్టించినా ఆశ్చర్యం లేదు!
రాజా సింగ్ డేరింగ్ అండ్ డాషింగ్ అప్రోచ్ ఫ్యూచర్లో ఆయనకు మంచి చేస్తే చేయొచ్చేమో కాని ఇప్పుడైతే ఇబ్బందులే తెచ్చిపెడుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా ఓల్డ్ సిటీలో జరిగిన శోభా యాత్రలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణానికి అడ్డు పడితే తలలు నరుకుతామని ఘాటుగా హెచ్చరిక చేశారు. ఇది ఏ వర్గాన్ని ఉద్దేశించిందో అర్థం చేసుకోటానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు కదా! ఆ వర్గం నుంచే ఒకాయన డబీర్ పురా పీఎస్ లో కేసు కూడా పెట్టాడు! అయితే, రాజా సింగ్ కు కేసులే కాదు జైలు కూడా కొత్త కాదు! ఆయన సమైక్యాంధ్రప్రదేశ్ ని కాంగ్రెస్ పాలించిన పదేళ్లలో అనేక సార్లు ఊచలు లెక్కించారు. ఎంఐఎం ఒత్తిడి మేరకే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రాజా సింగ్ ను పదే పదే జైలు కి పంపిన దాఖలాలున్నాయి. కాని, అవన్నే రాజా సింగ్ కు పాత బస్తీలో ఇమేజ్ ను , ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి!
రామ మందిర విషయంలో కమలం నాయకులు అవసరాన్ని బట్టీ ఘాటుగా, స్మార్టుగా మాట్లాడటం మామూలే! కోర్టు తేల్చుతుందని చెప్పే వారు మొదలు తలలు తెగుతాయని బెదిరించే వారి దాకా అందరూ ఒకే పార్టీలో కనిపిస్తారు మనకు! అందులో రెండో రకమే రాజా సింగ్! ముందు ముందు ఈ ఫైర్ బ్రాండ్ కాషాయ లీడర్ అమిత్ షా ఎలా ఉపయోగించుకుంటారో … వేచి చూడాలి!






