2జి స్పెక్ట్రమ్ కేసులో ఎ రాజాకు బెయిల్
Published on: Tue May 15, 2012 2:39PM
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టెలికాం మాజీమంత్రి ఎ. రాజాకు మంగళవారం పాటియాలా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ వదిలి వెళ్లరాదని ఆదేశించింది. తమిళనాడుకు వెళ్లరాదని కోర్టు రాజాను ఆదేశించింది. రాజా మంగళవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. రాజాకు బెయిల్ ఇవ్వరాదని సిబిఐ కోర్టులో వాదించింది. లెసెన్సుల మంజూరులో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించింది. ఈ కేసులో రాజా గత 15 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. నిరుడు ఫిబ్రవరి 11వ తేదీన రాజాను సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసులో చివరగా బెయిల్ పొందిన నిందితుడు రాజానే.


