TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజ్‌ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Published on: Fri May 23, 2025 5:02PM

 

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్‌ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. తన కొడుకు అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించడం లేదంటూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. 

మద్యం స్కాంలో సీఆర్పీసీ 160 ప్రకారం హైదరాబాద్‌లో ఉంటున్న తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదంటూ కసిరెడ్డి అందులో పేర్కొన్నారు. దాఖలు చేసిన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి పంపించామని పేర్కొన్నారు. ఈ నెల 19న తండ్రీకొడుకుల పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ పార్థివాలా ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.  వాటిని కొట్టివేస్తున్నట్లు తాజాగా శుక్రవారం తీర్పు వెలువరించింది. రెగ్యులర్ బెయిల్‌ వంటి విషయాలు హైకోర్టులో చూసుకోవాలని  సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నాది.