తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి వర్షాలు
Published on: Fri Nov 24, 2023 11:57AM
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసాయి. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నట్టు పేర్కొంది. కాగా, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా దామరచర్లలో అత్యధికంగా 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్లో అత్యల్పంగా 17 డిగ్రీలు, ఆదిలాబాద్లో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని, రాత్రిపూట ఊష్ణగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 26 వరకు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలు లేవని స్పష్టం చేసింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం పొగమంచు కమ్మేస్తుందని చెప్పింది.


