TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు... ఈ రోజు భారీ వర్ష సూచన 

Published on: Mon Jul 15, 2024 5:12PM

షియర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురియవచ్చునని తెలిపింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని... ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
భూగర్భ శాస్త్రంలో, షీయర్ జోన్ అనేది భూమి సన్నని జోన్, ఇది జోన్‌కు ఇరువైపులా ఉన్న రాతి గోడలు ఒకదానికొకటి జారడం వల్ల  షియర్ జోన్ ఏర్పడుతుంది.   
నేడు కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.