TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

3 రోజుల్లో వర్షాలే వర్షాలు!

Published on: Tue Jul 15, 2014 3:43PM

 

వర్షాలు కురవడం లేదనేనా మీ చింత? డోన్ట్ వర్రీ.. జస్ట్ ఇంకో మూడు రోజులు వెయిట్ చేయండి... భారీ వర్షాల్లో తడిచి ముద్దవ్వండి.. ఇది వాతావరణ శాఖ ఇస్తున్న హామీ. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలపై అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.