TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణకు వరుణ గండం.. మరో మూడు రోజులు వానలే వానలు

Published on: Sat Oct 15, 2022 7:16AM

తెలంగాణను వరుణుడు విడవడం లేదు. భారీ వర్షాలు తెరిపిచ్చాయన్న ఆనందం ఒక్క రోజులోనే ఆవిరయ్యేలా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికకు తగినట్లుగానే హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది.

నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వాతావరణ కేంద్రం హెచ్చరికతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలలో సిబ్బందిని మోహరించింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది.