TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.!

Published on: Fri Jul 3, 2026 9:36AM

తెలుగు రాష్ట్రాలలకు వాతావరణ శాఖ రైన్ అలర్ట్ ప్రకటించింది.  వచ్చే వారం రోజుల పాటు  ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకుగా ఉండటంతో ఏపీ, తెలంగాణల్లో శుక్రవారం( జూన్ 3) నుంచి ఈ నెల 9 వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.   

భారీ వర్షాలకు తోడు 50 కిలోమీటర్లకంటే ఎక్కువ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరీ ముఖ్యంగా  ఉత్తర తెలంగాణలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.  శుక్ర, శని (జులై 3, 4) వారాలలో  ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ,  అలాగే శనివారం (జులై 4 ) ఆదివారం (జులై 5)   భారీ వర్షాలతో పాటు గంటకుబలమైన ఈదురుగాలులు వీస్తాయనీ హెచ్చరించింది. 

ఇక ఆదివారం (జులై 5) నుండి జులై 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ  ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా,  రాయలసీమ ప్రాంతాల్లో  వర్షాలు ఓ రేంజ్ లో దంచి కొడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.