రైల్వేశాఖకు కరెంట్‌ కష్టాలు

 

విభజన సెగలతో రాష్ట్రంలోని అన్ని రంగాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే విద్యుత్‌ జెఎసి సమ్మెతో సీమాంద్రలోని చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకోగా. రైల్వేశాఖ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది.

 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రైళ్లరాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆది, సోమ వారాల్లో పలు రైళ్లను రద్దు చేశారు. ఈ రెండు రోజుల్లో తొమ్మిది రైళ్లను పూర్తిగా, మరో నాలుగు రైళ్లను పాక్షికంగా నిలిపిస్తేన్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

 

చెన్నై విజయవాడల మధ్య నడిచే పినాకిని , జనశతాబ్ది ఎక్స్‌ ప్రెస్‌లను పూర్తిగా రద్దు చేశారు. వీటితో పాటు తిరుపతి వెళ్లాల్సిన పద్మావతి, నారాయణాద్రి ఎక్స్‌ ప్రెస్‌ లను రేణిగుంట, గుత్తి, డోన్‌, కాచీగూడల మీదుగా మళ్లించారు.