రాజంపేట మహిళలకు బంగారు కానుక?
Published on: Sun Jun 10, 2012 2:58PM
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం మహిళలకు శుభవార్త వారి కోసం బంగారు కానుకలు సిద్దమయ్యాయి. సుమారు వేలు చిన్న సైజు ముక్కుపుడకలు పంపిణి చేసేందుకు అభ్యర్ధులు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఇంకొ 72గంటల్లో ఉన్నందున ముందుగానే పంపిణి చేయాలనీ వారు యోచిస్తున్నారు. దీంతో పాటు వెండి కుంకుమ భరిణె కుడా అందవచ్చు. ఈ నియోజకవర్గంలోని మహిళలు తమ తలరాత మారుస్తారని అభ్యర్థులు నమ్మటం వల్ల ఈ కానుకలకు ఏర్పాట్లు జరిగాయి. కార్యకర్తలు ద్వారా వీటిని ఓటర్లకు చేరవేయనున్నారు. ఇదిలా ఉంటే రైల్వేకొడురులో చీరెలు పంపిణి చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఎప్పటి వరకు కడప జిల్లాలో 480గ్రాముల బంగారం, 11కేజీల వెండి పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వీటిని ఎన్నికల కోసం కనుగోలు చేశారు. ఏమైనా పలకరిస్తే మాములుగా కూల్ డ్రింక్ ఇవ్వని ఇవ్వని అభ్యర్ధులు వేసవిని దృష్టిపెట్టుకొని మాధవపురంలో 2లీటర్ల బాటిల్స్ పంపిణి చేశారు .


