TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏటీఎంలో రైలు టిక్కెట్టు

Published on: Mon Aug 27, 2012 8:42AM

ఇకపై రైలు టిక్కెట్టు కొనాలంటే క్యూలో నిలబడాల్సిన పనిలేదు. నేరుగా వెళ్లి మిషన్ లో వివరాలు ఎంటర్ చేసి టిక్కెట్ కొనుక్కుని రైలెక్కేయొచ్చు. రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా ఐదు స్టేషన్లలో ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్లని ఏర్పాటుచేస్తోంది. బేగంపేట, సికింద్రాబాద్‌, కాచిగూడ, మలక్‌పేట, సీతఫల్‌మండి స్టేషన్లలో ఈ మిషన్లను ఏర్పాటుచేస్తున్నారు. రిటైరైన ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి
ప్రయాణికులకు వీటిపై అవగాహనకల్పించేందుకు నియమిస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేసే మిషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ తోపాటు జనరల్, సెంకండ్ క్లాస్ టిక్కెట్లు తీసుకునే అవకాశంకూడా ఉంది. భవిష్యత్తులో మరింత అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ మిషన్లను అభివృద్ధిచేసి అన్ని స్టేషన్లలో పెట్టాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇప్పటికే బ్యాంకుల సాయంతో కాయిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేసిన రైల్వేశాఖ
కొత్తగా ఏర్పాటుచేస్తున్న టిక్కెట్ వెండింగ్ మిషన్లుకూడా బాగా సక్సెస్ అవుతాయని భావిస్తోంది.