రైల్వే బడ్జెట్: విదేశీ పెట్టుబడులకు అనుమతి
Published on: Tue Jul 8, 2014 1:18PM

రైల్వే నిర్వహణలో విదేశీ పెట్టుబడులును ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు. కేవలం ఆపరేషన్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. పీపీపీ పద్ధతిలో స్పీడ్ రైళ్లు ప్రవేశపెడుతామని పేర్కొన్నారు. ప్రయాణ, సరుకు రవాణా ఛార్జీలు పెంపుతో ఆదాయం పెంచుకోవడం సరికాదన్నారు. ఈ ఏడాది రూ. 602 కోట్లు మిగుల ఆదాయమే తమ లక్ష్యమని ప్రకటించారు. ప్రాజెక్టుల ఆమోదంపైనే తప్ప పూర్తిపైన దష్టి కొరవడిందన్నారు. ఏడాదిలోగా రైల్వేని గాడిన పెడుతామని ధీమా వ్యక్తం చేశారు. రైల్వే నిర్వహణలో నిధుల దుర్వినియోగాన్ని నియంత్రించాలన్నారు.


