మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్
Published on: Tue Jul 8, 2014 11:35AM

రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ఈరోజు ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ రైల్వే బడ్జెట్ పై కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ సమావేశాలలో తమ తొలి రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనుండ౦తో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది.


