TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

Published on: Sun Jul 20, 2025 12:56PM

 

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  పాతబస్తీ కుర్రోడు  రాహుల్ సిప్లిగంజ్  ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ అవార్డు ను అందుకున్నారు. 

సొంత కృషితో ఎదిగిన అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.  ఇటీవల గద్దర్ అవార్డుల  సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఆమేరకు ఇవాళ పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.స్వయం కృషితో హైదరాబాద్‌ నుంచి ఆస్కార్ స్థాయికి ఎదిగిన రాహుల్ యువతకు ఆదర్శమని ప్రశంసించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాహుల్‌ను గౌరవిస్తామని రేవంత్ గతంలో తెలిపారు. ఇటీవల గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమంలోనూ సింగర్‌కు ఏదైనా కానుక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టిని ముఖ్యమంత్రి కోరారు.