మళ్లీ మోడీపై రాహుల్ కౌంటర్...

 

ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీపై వరుస పెట్టి కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే కాదు.. తాజాగా రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గుజ‌రాత్‌లో 2012 అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న‌ నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని రాహుల్‌ గాంధీ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్లలో గుజరాత్‌లో 50 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తామని ఆ ఎన్నిక‌లప్పుడు మోదీ హామీ ఇచ్చార‌ని, మేనిఫెస్టోలో కూడా ఈ హామీని పెట్టారని తెలిపారు. గత ఐదేళ్లలో ఆ రాష్ట్ర స‌ర్కారు 4.72 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిందని, ఈ లెక్క ప్ర‌కారం బీజేపీ హామీని నిలబెట్టుకోవాలంటే మరో 45 ఏళ్లు పడుతుందని చుర‌క‌లంటించారు.