TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్త ఊసులు చెప్పిన రాహుల్ దూతలు

Published on: Mon Dec 3, 2012 2:13PM

 

  Rahul Gandi, Rahul Gandi Jagan, YS jagan Rahul Gandi, Rahul Gandi Congress ministers

 

రాష్ట్ర౦లో ముఖ్య మంత్రి మొదలుకొని కేంద్రంలో ఎ.ఐ.సి.సి నేతల వరకు, అందరూ కూడా జగన్ కేసులు, అతని అరెస్ట్ తో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, జగన్ విషయంలో చట్టం తనపని తానూ చేసుకుపోతుందని చెప్పిన నేతల చిలక పలుకులు మనం చాలాసార్లు విన్నాము. అదే సమయంలో, జగన్ కుటుంబ సభ్యులు అమాయకుడయిన తమ జగన్ బాబును అన్యాయంగా కేసులలో ఇరికించి జైలు పాలు చేసారని చెప్పుకొంటూ ప్రజల ‘ఓదార్పు’ కోరుకోవడమూ మనం నిత్య చూస్తునే ఉన్నాము.


మరో వైపు, మీడియా కూడా కట్టకట్టుకొని జగన్ వెంటాడుతూ అతని అవినీతి లీలలు కోసం వృదా అనుకోకుండా తమ ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియాలలో సింహభాగం కేటాయించి నిత్యం ప్రచురిస్తున్న వరుస కధనాలు ఒకవైపూ, వాటిని అంతే సమర్ధంగా తిప్పి కొడుతున్న జగన్ సొంతబాకా మీడియా మరియు జగన్ తల్లీ చెల్లెళ ఆక్రోశం మరో వైపు ప్రజలని అయోమయంలో పడేస్తున్న ఈ తరుణంలో ప్రజల సంశయ నివృత్తి చేసేందుకే అన్నట్లు రాష్ట్రంలో వచ్చి వాలారు రాహుల్ దూతలు.



వారు, రాబోయే ఎన్నికలలో జగన్ తో కాంగ్రేసు జతకట్టడం లాభమా నష్టమా? ఎంత శాతం? జగన్ని కాంగ్రేసు గూటికి మళ్ళీ తెచ్చుకొంటే మంచిదా కాదా? ఒకవేళ, రప్పించుకోవాలంటే ఏమి చేయాలి? ప్రతిగా యేయే వరాలు ఇవ్వాలి? వంటి ప్రశ్నావళిని చేతబట్టుకొని వచ్చి ‘అసలు జగన్ నిర్దోషా కాదా?’ అనే బేతాళ ప్రశ్నకు సమాధానం యిచ్చే పుణ్యం కట్టుకొంటున్నారు.


 
రాహుల్ దూతలు మన రాష్ట్ర నేతల ద్వారా తెలుసుకొన్న విషయాలలో చాల ఆసక్తి కరమయిన విషయాలు బయటకి వచ్చేయి.



ఒక సీనియర్ కాంగ్రేసు నాయకుడు ప్రస్తుతం జగన్ మీదనున్న అన్ని కేసులు ఎత్తివేసి, అతనికి ముఖ్య మంత్రి పదవి ఇచ్చేస్తే జగన్ మన గూటికోచ్చేస్తాడని చెప్పాడు. మరో నేత, మన కాంగ్రేసుకన్నా జగన్ పార్టీ మరియు తే.రా.స. లే ప్రస్తుతం రాష్ట్రంలో బలంగా ఉన్నాయని చెప్పి రాహుల్ దూతలకి షాకు తినిపించేడు.



ఈ రెండు సలహాలలో మొదటిది జగన్ పై కేసులు ఎత్తివేయడం మన చేతిలో పనే అని తెలియజేస్తూనే, ఆ పని (కేసుల్లో అతనిని ఇరికించడం జైలు పాలూ చేయడం చేసిందీ కాంగ్రేసే అని చెప్పక చెప్పింది. అంటే, ఒక వేళ కాంగ్రేసు జగన్ని కావాలనుకొంటే అతనిని అవలీలగా కేసుల నుంచి బయట పడేయగలదు. అతనివల్ల తమ పార్టీకి నష్టం అనుకొంటే అతనిని ఎంత కాలమయిన జైల్లోనే ముగ్గ బెట్టేయగలదు. కనుక, ప్రజల ధర్మ సందేహం తీరిపోయినట్లే.



ఇప్పుడు ఒకటి కొంటే మరొకటి ఉచితంగా పొందే రోజులివి గనుక, రాహుల్ దూతల రాష్ట్ర పర్యటన ద్వారా మనకి మరో గొప్ప నిజం ఉచితంగా లభించింది. అదేమంటే, చంద్రబాబు నొక్కి వక్కణిస్తున్నట్లు ప్రస్తుతానికి ‘తల్లి కాంగ్రేసు’ ‘పిల్ల కాంగ్రేసు’  పైపైకి ఒకరినొకరు ఎంత తిట్టుకొన్నపటికీ రేపు ఎన్నికలు దగ్గిరపడగానే ఆ తల్లిపిల్లలొకటయిపోతాయని, లేదంటే కనీసం ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనకి అడగకుండానే తెలియజేసి పుణ్యం కట్టుకొన్నారు.



గాని వాళ్ళు మనకి ఇంకా చెప్పవలసిన విషయం మరొకటి ఉండిపోయింది. ప్రస్తుతానికి బయట పడకుండా, ఇదివరకు కాంగ్రేసు మన మెగాస్టారు ఆడిన ఆటనే మళ్ళీ ఆడి మనకి చూపించి అప్పుడు తే.దే.పా.ను దెబ్బకొట్టినట్లే మళ్లీ దెబ్బకొట్టిన తరువాత కలుస్తారా లేక ముందే కలుస్తారా అనే సంగతి కూడా చెప్పేస్తే ప్రజలకి మరో పెద్ద సంశయ నివృత్తి చేసిన పుణ్యం కాంగ్రేసుకి దక్కుతుంది.