ర్యాలీపై మమతకు రాహుల్ లేఖ

 

బీజేపీకి తీరుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 19 న  కలకత్తాలో "యునైటెడ్ ఇండియా" అంటూ మెగా ర్యాలీని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా భాజాపాయేతర పార్టీలన్నింటికీ మమతా ఆహ్వానం పంపారు. కాగా ఈ ర్యాలీలో బీజేపీ కి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హాజరు కావటంలేదు. ఆ పార్టీ తరఫున సీనియర్ నాయకులు, లోక్ సభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, అభిషేక్ మను సింగ్వి ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మమతకు రాహుల్ లేఖ రాశారు.  

"ర్యాలీకి తమ మద్ధతు ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. మేలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపేతర శక్తులను కూడ గట్టేందుకు అన్ని పార్టీలు ఒకే తాటిపైకి రావాలని రాహుల్ కోరారు. అధికార బీజేపీకి విపక్షాల శక్తి ఎంటో ఈ ర్యాలీ ద్వారా సుస్పష్టం చేయాలని వెల్లడించారు. నిజమైన జాతీయత, అభివృద్ధి ప్రజాస్వామ్య పునాదులపైనే రూపొందాలని ఆయన అభిప్రాయపడ్డారు. సాంఘిక న్యాయం, సెక్యులరిజం లాంటి వాటిని మోడీ ప్రభుత్వం నాశనం చేసిందని వెల్లడించారు. ఈ ర్యాలీతో బీజేపేతర పార్టీలతోనే సరైన పాలన సాధ్యమవుతుందనే అభిప్రాయం ప్రజల్లో కలగాలని" రాహుల్ లేఖలో కోరారు.