తెలంగాణలో అధికారం.. ఏపీలో ఉత్సాహం.!!

ప్రధాని పదవి సొంతం చేసుకోవడం కాదు.. మోదీని ప్రధాని పదవికి దూరం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అనే ఉద్దేశంతో రాహుల్ అన్ని రాష్ట్రాల మీద దృష్టి పెడుతున్నారు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.. ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్.. విభజన అనంతరం తెలంగాణలో ప్రతిపక్షానికి పరితమైంది.. ఇక ఏపీలో అయితే ఒక్క సీట్ కూడా గెలవలేదు.. వచ్చే ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని చూస్తుంది.

 

 

దానిలో భాగంగానే రాహుల్ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్ తెలంగాణకు రానున్నారు.. ఈ పర్యటనలో పార్టీ నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే బస్సుయాత్రల్లో పాల్గొంటారు.. అదే విధంగా ఓయూ విద్యార్థులతో సమావేశం అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. మరోవైపు త్వరలో రాహుల్ ఏపీ పర్యటన కూడా ఉండబోతుందట.. ఏపీలో భారీ బహిరంగసభ పెట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలనుకుంటున్నారట.. చూద్దాం మరి తెలంగాణలో అధికారం పొందాలని, ఏపీలో పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ఏ మేరకు విజయం సాధిస్తుందో.