మోడీ పై రాహుల్ దాడి.!!!

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు.గల్లా,రాకేష్ సింగ్ ప్రసంగాలు ఆసక్తిగా సాగాయని,గల్లా జయదేవ్ ప్రసంగంలో బాధ కనిపించిందని రాహుల్ గాంధీ అన్నారు.ప్రధాని ఇచ్చిన మాటకు విలువ ఉండాలన్నారు.

 

 

ప్రతి ఖాతాలో 15 లక్షలు జమచేస్తామన్నారు..ఏం చేసారు?, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఏమయ్యాయి? అని కేంద్రాన్ని నిలదీశారు.ఉద్యోగాలు అడిగితే పకోడిలు అమ్ముకోమంటున్నారని, గారడీ కబుర్లు చెబుతున్నారని, మోదీ పాలనలో ప్రజలంతా బాధితులేనని ఆయన అన్నారు. జీఎస్టీ స్లాబ్‌ ఒకటే ఉండాలని చెప్పాం, కానీ ఐదు స్లాబ్‌లు పెట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో ఉండాలని చెప్పాం, కానీ తీసుకురాలేదు.ఒకరోజు అర్థరాత్రి ఆకస్మాతుగా పెద్దనోట్లు రద్దు చేశారు. దాని వల్ల ఏం ప్రయోజనం జరిగింది. పెద్దనోట్ల రద్దు వల్ల మధ్య, చిన్న తరగతి పరిశ్రమలు దివాళా తీశాయి. వాటిలో పనిచేస్తున్న ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఒక్కసారిగా దేశం నెత్తిన జీఎస్టీ రుద్దారు. తాను దేశానికి ప్రధానమంత్రి కాదు,సేవకుడిగా ఉంటానని మోదీ చెప్పారు. అమిత్‌ షా కుమారుడు అవినీతికి పాల్పడినప్పుడు ఈ సేవకుడు ఏమయ్యారు? అని నిలదీశారు.రాఫెల్‌ ఒప్పందంలో కుంభకోణం జరిగిందని ఆరోపించిన రాహుల్‌ గాంధీ, తాను స్వయంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడుని కలిసి ఈ ఒప్పందం గురించి అడిగానని అన్నారు. ఇలాంటి ఒప్పందమేమీ భారత్‌తో చేసుకోలేదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు తనతో చెప్పారని రాహుల్‌ తెలిపారు.