అందని ద్రాక్షగా ప్రధాని పదవి..
Published on: Wed Jul 25, 2018 11:29AM
కాంగ్రెస్ పార్టీ 2019 లో అత్యధిక మెజారిటీ సాధించి బీజేపీని అధికారానికి దూరం చేయాలనే లక్ష్యంతో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది.కానీ నాయకత్వం విషయంలో ఆయా పార్టీల్లో భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో చివరికి ప్రధాని పదవిని వదులుకోడానికి రాహుల్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పార్లమెంట్ లో ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ నమ్మదగిన భాగస్వామి కాదని, మిత్రపక్షాలను ముంచిన చరిత్ర ఆ పార్టీకి ఉందని,ప్రతిపక్షాల్లో చాలామంది ప్రధాని పదవి కోసం ఆరాటపడే వారు ఉన్నారని, నాయకత్వం విషయం చర్చకు రాగానే ఆ కూటమి విచ్ఛిన్నమవుతుందని వ్యాఖ్యానించారు.దీంతో ప్రధాని పదవిని త్యాగం చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఎక్కువ సీట్లు వచ్చినా.. బీజేపీని అడ్డుకోవడం కోసం జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం పదవిని కట్టబెట్టారు.ఇదే పద్ధతి ప్రధాని పదవి విషయంలో కూడా పాటించనున్నారని తెలుస్తోంది.తమతో జట్టు కట్టబోయే పార్టీల్లో ప్రధాని అభ్యర్థిని ప్రకటించాల్సి వస్తే.. అందుకు ప్రధానంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల పేర్లే కాంగ్రెస్ పరిశీలనకు వస్తున్నట్లు తెలుస్తోంది.‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఎక్కువ సీట్లు వస్తే ప్రధాని పదవిని చేపట్టేందుకు సిద్ధం’’- అని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటన చేసిన రాహుల్.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఏ నిర్ణయం తీసుకుంటారో?..


