TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత

Published on: Wed Jun 9, 2021 2:11PM

కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న హస్తం పార్టీకి మరో ముఖ్య నేత హ్యాండిచ్చారు. రాహుల్ గాంధీకి షాకిస్తూ యువ నేత కమలం గూటికి చేరారు. మరో ఆరేడు నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ కు ఇది ఊహించని ఎదురు దెబ్బని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జితిన్ ప్రసాద బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రైల్వే మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకడైన జితిన్ ప్రసాద యూపీ ఎన్నికల వేళ బీజేపీలో చేరడం సంచలనం రేకెత్తించింది. 

బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద గత ఏడాది జులైలో బ్రాహ్మణ చేతనా పరిషత్ నెలకొల్పి ఆ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నారు కూడా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన జితేంద్ర ప్రసాద తనయుడే జితిన్. 2001లో యూత్ కాంగ్రెస్‌లో చేరిన జితేంద్ర 2004 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని షాజహాన్‌పూర్‌ నుంచి పోటీ చేశారు. యూపిఏ హయాంలో మన్మోహన్ కేబినెట్‌లో యువ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు తరాల అనుబంధం ఉందన్నారు. బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని, మిగతా వన్నీ ప్రాంతీయ పార్టీలేనని జితిన్ ప్రసాద బీజేపీలో చేరాక విలేకరులతో అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కథ ముగిసినట్టేనని చెప్పారు జితిన్ ప్రసాద