TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ అంటే మంట.. కాంగ్రెస్ కి పంట.!!

Published on: Sat Aug 4, 2018 2:39PM

 

తెలంగాణాలో టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి.. అధికార టిఆర్ఎస్ ని దెబ్బ తీయడానికి వచ్చిన ఏ అవకాశాన్ని కాంగ్రెస్ వదలట్లేదు.. కాంగ్రెస్ అధిష్టానం కూడా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం పొందాలని తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. దానిలో భాగంగానే ఈ నెల 13,14 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.. అయితే రాహుల్ పర్యటనలోని ఒక అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది.. అదే రాహుల్ ఓయూను సందర్శించనుండటం.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ విద్యార్థులు కేసీఆర్ కు మద్దతుగా నిలిచారు.. కానీ తరువాత పరిస్థితులు మారిపోయాయి.. కేసీఆర్ ప్రభుత్వ విధి, విధానాలను ఓయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పాలిట వరంలా మారనుంది.. కేసీఆర్ అంటే మండిపడుతున్న ఓయూకు దగ్గరైతే తమకు పంట పండినట్టే అని కాంగ్రెస్ భావిస్తోంది.. చూద్దాం మరి కాంగ్రెస్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో.