మోదీ అబద్ధాలు చెబుతున్నారు

 

కర్ణాటకలోని బీదర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ రాఫెల్‌ ఒప్పందం గురించి మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు చేసారు..  ‘యూపీఏ హయాంలో రాఫెల్‌ ఒప్పందం గురించి ఫ్రాన్స్‌తో మాట్లాడాం.. మీ టెక్నాలజీ ఉపయోగించుకుని భారత్‌లో యుద్ధవిమానాలు తయారు చేస్తాం అన్నారు.. దీని వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించినట్లువుతుంది.. కానీ మోదీ అధికారంలోకి రాగానే, రాఫెల్‌ ఒప్పందం మొత్తం మార్చేశారు.. రాఫెల్‌ కొనుగోలుకు ఎంత ఖర్చయిందనే విషయాలను రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ దాచి పెడుతూ అబద్ధాలు చెబుతున్నారు. అదేమంటే రాఫెల్‌ కొనుగోలుకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచాలని ఫ్రాన్స్‌, భారత్‌ మధ్య ఒప్పందం ఉందని చెబుతున్నారు. కానీ అటువంటి ఒప్పందమేమి లేదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు స్వయంగా నాతో చెప్పారు. ప్రభుత్వం బయట పెట్టాలనుకుంటే రాఫెల్‌ ధర ఎంతో చెప్పొచ్చు’ అని అన్నారు. 

'రాఫెల్‌ ఒప్పందంపై సంతకం చేసే సమయంలో ప్రధాని మోదీ పక్కన అనిల్‌ అంబానీ ఉన్నారు.. యువతకు ఉద్యోగాలు రాకుండా అంబానీ లాక్కున్నారు.. రాఫెల్‌ ఒప్పందంపై చర్చకు రావాల్సిందిగా మోదీకి చాలా సార్లు సవాల్‌ విసిరాను.. కానీ ఆయన నా సవాల్‌ను ఎప్పటికీ అంగీకరించరు.. ఆయన ఎందుకు నా ప్రశ్నల నుంచి పారిపోతున్నారు?' అని రాహుల్‌ ప్రశ్నించారు.. 'మోదీ నా కళ్లలోకి సూటిగా చూడలేరు.. ఎందుకంటే రాఫెల్‌ ఒప్పందం విషయంలో ఆయన అబద్ధాలు చెబుతున్నారు.. అందుకే చూడలేకపోతున్నారు.. దాని గురించి కనీసం ఒక్క సెకన్‌ కూడా ఆయన మాట్లాడటం లేదు’ అని రాహుల్‌ మండిపడ్డారు.