TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్‌గాంధిని పార్లమెంటు నుంచి బహిష్కరిస్తారా?

Published on: Mon Mar 14, 2016 12:01PM

ఇంగ్లండులో ఒక వ్యాపారసంస్థను స్థాపించే సమయంలో, రాహుల్ గాంధి తాను బ్రిటిష్ పౌరుడినని చెప్పుకున్న విషయం ఆయనను చిక్కుల్లో పడవేయనుందా! అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయమై తగిన ఆధారాలు ఉన్నాయంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గతంలో ప్రధానమంత్రికి ఓ లేఖ కూడా రాశారు. భారతదేశ పౌరుడిని అని చెప్పి పార్లమెంటులో అడుగుపెట్టిన రాహుల్‌గాంధి, బ్రిటన్‌ పౌరుడినంటూ అక్కడ ఎలా ప్రకటిస్తారంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఈ విషయమై ఇప్పడు పార్లమెంటు నైతిక సంఘం (ఎథిక్స్‌ కమిటీ), రాహుల్ కార్యాలయానికి ఒక షోకాజ్ నోటీసుని పంపినట్లు తెలుస్తోంది.

భారత రాజ్యంగం ప్రకారం, మన దేశ పౌరులు మాత్రమే పార్లమెంటుకు పోటీ చేసేందుకు అర్హులు. పైగా భారత దేశం ఉమ్మడి పౌరసత్వాన్ని అంగీకరించదు. అంటే ఒక వ్యక్తి తాను బ్రిటన్ పౌరుడిని అని చెప్పుకుంటే, అతడి భారతదేశపు పౌరసత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్‌ గట్టి చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. ఒకవేళ రాహుల్ గాంధి మీద వచ్చిన అభియోగం నిజమే అయితే... ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని మాత్రమే కాదు, దేశ పౌరసత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.