TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోదీగారు టీ కోసం వెళ్లకుండా ఉండాల్సింది- రాహుల్‌!

Published on: Thu Mar 3, 2016 10:11AM

 

ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధి ఎట్టకేళకు లోక్‌సభలో నోరువిప్పారు. నిన్న పార్లమెంటులో 40 నిమిషాల పాటు మాట్లాడిన రాహుల్‌గాంధి, నేరుగా మోదీని విమర్శించేందుకే అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. నల్లధనాన్ని వెలికితీస్తామన్న ప్రభుత్వం చివరికి నల్లధనాన్ని, తెల్లధనంగా మార్చుకునేందుకు అవకాశం ఇచ్చిందనీ.... అది ఫెయిర్‌ అండ్‌ లవ్లీ పథకం అనీ ఎద్దేవా చేశారు. నాగా ఒప్పందం విషయంలో కానీ, పాకిస్తాన్‌ పర్యటన విషయంలో కానీ మోదీగారు ఎవ్వరినీ సంప్రదించలేదనీ, ఆయనకి ఏది తోస్తే అదే చేస్తారనీ విమర్శించారు.

 

తాము ఎన్నో ఏళ్లుగా కష్టపడి పాకిస్తాన్‌ను ప్రపంచం ముందర దోషిగా నిలబెడితే... మోదీ, నవాజ్‌ షరీఫ్‌తో టీ తాగేందుకు లాహోర్‌ వెళ్లి తమ కష్టాన్నంతా బూడిదపాలు చేశారని విమర్శించారు. అయితే పాకిస్తాన్‌ను దోషిగా నిలిపేందుకు తాము ఏం కష్టపడ్డారో, మోదీ పాకిస్తాన్‌కు వెళ్లడం వల్ల అది ఎలా వృథా అయ్యిందో రాహుల్‌ చెప్పలేదు! నిజానికి మోదీ ఆకస్మిక పర్యటనకు  ప్రపంచవ్యాప్తంగా ప్రశంశలు లభించాయి. నాగా ఒప్పందం విషయంలో కూడా మోదీ తనను సంప్రదించినట్లు రాజనాథ్‌ సింగ్ పేర్కొన్నారు. మరి రాహుల్‌ ఏ ఉద్దేశంతో ఈ విమర్శలు చేశారో!