TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్‌ వాటీజ్‌ దిస్

Published on: Thu Jan 21, 2016 5:42PM

 ఓ వారసత్వపు  మేధావి దేశాన్ని ఏలాలని ఆరాటపడుతున్నాడు. కానీ.. ఎప్పుడు ఏమీ చేయాలో తెలియక సతమతమవుతుంటాడు.. అయినా అంతా  సరిగ్గానే చేశానని బిల్డప్పులిస్తుంటాడు..  ఆ  మేధావి ఎవరో ప్రత్యేకం గా చెప్పాలా ?  .. దాద్రీలో  గొడవపై నో రియాక్షన్‌.. చివరకు వరంగల్‌ ఉప ఎన్నిక సమయంలో తమ పార్టీ అభ్యర్థి  ఇంట్లో జరిగిన ఘోరంపైనా స్పందించని గొప్ప రాజకీయనేత.  అప్పట్లో వరంగల్లో ఘటన జరిగింది కూడా దళితుడి ఇంట్లోనే.. రాజయ్య కోడలు బిసి అయినా.. మన దేశంలో పెళ్లితర్వాత భర్త పేరును బట్టే భార్య ఇంటిపేరు కూడా మారుతుంది.  అలా చూసినప్పుడు  రాజయ్య కోడలు కూడా దళితురాలే.. ఆమెతో పాటు చనిపోయిన ముగ్గురు ముద్దులొలికే అభం శుభం తెలియని చిన్నారులు కూడా దళితులే.. మరి వీళ్లను పలకరించడానికి ఆనాడు రాహుల్‌ రాలేదే. మరిప్పుడు మాత్రం రోహిత్‌ మరణ వార్త తెలియగానే. ఆగమేఘాల మీద, ప్రత్యేక విమానంలో రావడానికి గల కారణమేంటో ? అంటూ జనాలు చెవులు కొరుక్కోవటం కాదు, ఏకంగా  సోషల్ మీడియా లో కోడై కూస్తున్నారు ..చదువుకున్న మేధావి ఏం చేసినా చెల్లుతుంది. పైగా రాజకీయాల్లో ఉంటే ఇంకా బాగా చెల్లుబాటవుతుంది అంటూ పెదవులు విరుస్తున్నారు . వాటీజ్‌ దిస్‌ రాహుల్‌ జీ...ఏదన్నా చేసేముందు కాస్త వెనకా ముందు ఆలోచించు అంటూ కొంచం ఘాటు గానే విమర్శిస్తున్నారు. అయినా , ఏమయినా రాహుల్ తోచిందే చేస్తాడు, అనిపించిందే చెప్తాడు..అది తనని , తన పార్టీ ని ఎంత అభాసుపాలు చేసినా కాని. ఇబ్బందులు పెట్టినా కాని. దట్ ఈస్ రాహుల్ .