TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇప్పుడు చెబుతున్న పాఠాలు అప్పుడు ఏమయ్యాయి రాహుల్..?

Published on: Wed Jan 20, 2016 11:06AM

నరం లేని నాలుక ఎన్ని రకాలుగా అయిన మాట్లాడుతుంది అన్న సామెత మన రాజకీయ నేతలకు బాగా సూటవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ మాటలు చూస్తే అలానే అనిపిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. ఈసందర్భగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూనివర్శిటీకి వచ్చి రోహిత్ కుటుంబ సభ్యుల్ని.. విద్యార్థుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ యూనివర్శిటీకీ చెందిన విద్యార్ది ఆత్మహత్య చేసుకుంటే వారికి సంబంధించిన వారిని పరామర్శించాల్సిన బాధ్యత వర్సటీ వీసీ మీద లేదా? అంటూ రాహుల్ ప్రశ్నించారు.

అయితే రాహుల్ గాంధీ ప్రశ్నించినంత వరకూ బానే ఉంది కాని.. ఈ ప్రశ్న రాహుల్ గాంధీ వేయడంతో చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమకు ఏమాత్రం సంబంధం లేని ఒక విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నందుకు రాహుల్ గాంధీ అంతలా రియాక్ట్ అయి ఇక్కడికి వచ్చి పరామర్శించారు..అలాంటిది తమ పార్టీ తరుపున ఎంతోమంది కార్యకర్తలు పలు సందర్బాల్లో మరణించారు కానీ వారిని పరామర్శించడానికి ఎన్నడూ రాలేదు.. అంతేకాదు గత పదియేళ్లు హయాంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పడంలో సందేహం లేదు.. అలాంటి నేత ప్రమాదవశాత్తు మరణించారు. అలాంటి నేత మరణించినప్పుడు చాలా మంది కార్యకర్తలే మరణించారు. మరి అప్పుడు కనీసం ఒక్కరిని కూడా పరామర్శించలేదు సరికదా ఓదార్పు యాత్రలు మొదలు పెట్టిన జగన్ ను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆయనపై చర్యలు తీసుకోవటానికి కూడా వెనుకాడలేదు. అలాంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఇలా మాట్లాడటం.. విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మొత్తానికి నీతులు ఉన్నది చెప్పడానికే కాని పాటింటడానికి కాదు అన్నట్టు రాహుల్ గాంధీ ఇలాంటి నీతులు చెప్పెటప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే బావుంటుందని అనుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.