మోడీకి రాహుల్ ‘ఫ్యుయల్ ఛాలెంజ్’..

విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్ కు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా స్పందించడం.. నీ సవాలును స్వీకరిస్తున్నాను. త్వరలోనే నా ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ వీడియోను పంచుకుంటాను’ అని తన మోదీ ట్విటర్‌లో తెలపడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఛాలెండ్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్పందించి మోడీ మరో ఛాలెంజ్ చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై మోడీకి రాహుల్ సవాల్ విసిరారు. డియర్ పీఎం కోహ్లీ ఫిటినెస్ ఛాలెంజ్ ను అంగీకరించినందుకు సంతోషం. నేను మీకో ఛాలెంజ్ చేస్తున్నాను. ‘పెట్రో’ ధరలు తగ్గించండి లేకపోతే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. ‘పెట్రో’ ధరలు తగ్గించాలని మీపై ఒత్తిడి చేస్తున్నాం. మీ ప్రతిస్పందన కోసం నేను ఎదురుచూస్తున్నాను’ అంటూ ‘ఫ్యుయల్ ఛాలెంజ్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ ట్వీట్ చేశారు. మరి రాహుల్ ఛాలెంజ్ ను మోడీ స్వీకరిస్తారో...? లేదో..? చూద్దాం..