రాయ్ బరేలీ ఎమ్మెల్యేతో రాహుల్ పెళ్లి... చీచీ రాహుల్ తోనా..
Published on: Mon May 7, 2018 5:41PM
.jpg)
ఒకపక్క కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బిజీ.. బిజీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఇప్పుడు రాహుల్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి చక్కర్లు కొడుతుంది. అదే రాహుల్ గాంధీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది కూడా రాయ్ బరేలీ నియోజకవర్గ ఎమ్మెల్యే అదితీ సింగ్ తో అన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన అదితీ సింగ్...‘ ఈ వార్తలు నన్ను చాలా బాధించాయి... దీనిపై ఇప్పటికైనా నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా... రాహుల్ నాకు పెద్దన్నయ్యతో సమానం... ఆయన నాకు రాఖీ బ్రదర్. ..సోషల్ మీడియాలో సంచలనం అవుతోన్న ఈ వార్తలను విని ఎంతగానో బాధపడ్డా. ఇప్పటికైనా వీటికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నాను’ అని ఆమె అన్నారు.


