TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నా పని అయిపోయిందనుకున్నా....

Published on: Mon Apr 30, 2018 10:39AM

 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీఇటీవల పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపంతో కర్ణాటకలోని హుబ్బళి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైంది. అయితే విమానంలో ఉన్న వాళ్లందరూ ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని భయంతో కేకలు వేయగా..  రాహుల్ మాత్రం నిబ్బరంగా ఉన్నారు. ఇక ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన జనాక్రోశ్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... విమానం ఒక్కసారిగా 8 వేల అడుగుల ఎత్తునుంచి కిందకు జారడంతో అంతా అయిపోయిందనుకున్నానని.. ఆ సమయంలో భగవంతుడిని స్మరించుకున్నానని, కైలాస్ మానస సరోవర్‌ను సందర్శించాలనుకున్నానని తెలిపారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో మానస సరోవర్ సందర్శనకు వెళ్తానన్నారు. దీంతో కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే యాత్రకు వెళ్లేందుకు తనకు 15 రోజుల సెలవు కావాలని రాహుల్ కార్యకర్తలను అనుమతి కోరారు.