పీఎన్ బీ స్కాంలో జైట్లీ కూతురి పాత్ర...

 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో నీరవ్ మోడీ భారీ ఎత్తున స్కాంకు పాల్పడిన సంగతి తెలిసిందే కదా. కొన్ని వేల కోట్ల రూపాయల మింగేసి.. ఎంచక్కా విదేశాలకు పారిపోయారు. దీంతో మోడీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్సలు మొలయ్యాయి. మోడీ సర్కారు ఇమేజ్ దారుణంగా దెబ్బ తింది కూడా అయితే ఇప్పుడు  ఈ స్కాంకు సంబంధించి సంచలన కోణాన్ని తెర మీదకు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ. పీఎన్ బీని రూ.12600 కోట్లకు ముంచిన నీరవ్ మోడీ ఎపిసోడ్ లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కుటుంబానికి పాత్ర ఉందని.. ఈ కారణంతోనే ఆయన నోరు విప్పటం లేదన్న సంచలన ఆరోపణలు రాహుల్ చేశారు. గీతాంజలి జెమ్స్ తో లావాదేవీలు ఉన్నాయని..నిందితులకు చెందిన న్యాయ సంస్థలపై సీబీఐ దాడులు చేసిందన్న రాహుల్.. అదే సమయంలో జైట్లీ కుమార్తెకు చెందిన సంస్థల్లో మాత్రం దాడులు ఎందుకు నిర్వహించలేదన్న సూటి ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. మరి దీనిపై జైట్లీ ఎలా స్పందిస్తారో చూద్దాం..