ఏపీకి ప్రత్యేక హోదా మేమిస్తాం...


ఒకపక్క ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నా... కేంద్ర ప్రభుత్వం మాత్రం హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని... తాము అధికారంలోకి రాగానే చేసే మొట్టమొదటి పని అదేనని పేర్కొన్నారు. అంతేకాదు.. తర్వాత రాహుల్ ట్వీట్ చేస్తూ.. ప్రత్యేక హోదా పోరాటంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటై.. ఏపీకి న్యాయం చేయాలని బీజేపీపై ఒత్తిడి తీసుకురాగలమన్న విశ్వాసం తనకు ఉందని రాహుల్ పేర్కొన్నారు. తామందరం కలిసికట్టుగా ఉంటే ప్రధాని నరేంద్రమోదీని ఒప్పించి ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోగలమన్న విశ్వాసం ఉందని చెప్పారు.