రాహుల్ గాంధీ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌.. 16న పార్టీ పగ్గాలు


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలని ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ ప్రక్రియలో  రాహుల్ గాంధీ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ నెల 16న ఆయ‌న‌ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా రాహుల్ గాంధీ త‌ల్లి సోనియా గాంధీ ఉన్న విష‌యం తెలిసిందే. గాంధీ-నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన‌ ఐదో వ్య‌క్తిగా రాహుల్ గాంధీ నిలుస్తున్నారు.