ముందు ఏబీసీడీలు నేర్చుకో...

 

ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కామెంట్లు మామూలుగా చేయరన్న సంగతి తెలుసు కదా. పాపం రాహుల్ ను పప్పు అని, బ్రెయిన్ లేదని.. రాజకీయాలకు రాహుల్ వేస్ట్ అని అబ్లో ఒకటా రెండా ఎన్నో సెటైర్లు విసురుకుంటారు. అయితే ఇప్పుడు రాహుల్ కూడా కాస్త తన పంథాను మార్చి మోడీపై తెగ విమర్శలు గుప్పిస్తున్నాడు. దీంతో రాహుల్ కు కాస్త మెచ్యూరిటీ పెరిగిందని కూడా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీని ఉద్దేశించి రాహుల్ గాందీ ఒక ట్వీట్ చేశారు. రక్షణ, శిక్షణ, పోషణ లేదు. వారికి కేవలం రోదనే మిగిలింది. అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు నిరాశే మిగిలింది. గుజరాత్‌ మహిళలకు కేవలం హామీ ఇచ్చారు. కానీ వీటిని నిలబెట్టుకునే ఉద్దేశం మాత్రం లేదు అని అందులో ప్రస్తావించారు. అయితే దీనిపై మోడీ స్పందించలేదు కానీ... మంత్రి అబ్బాస్ నక్వీ మాత్రం రాహుల్ మాత్రం విరుచుకుపడ్డాడు. రాహుల్ కు వంకాయకి, బర్గర్‌కి.. పిజ్జాకి, ఉల్లిపాయకి తేడా తెలీని వ్యక్తి ఈ ప్రశ్నలు వేస్తున్నారా? ముందు ఏబీసీడీలు సరిగ్గా వస్తే అప్పుడు రాహుల్‌కి దేశ రాజకీయాలు, సంస్కృతి అర్థమవుతుందని విమర్శించారు. మరి దీనిపై రాహుల్ ఎలా స్పందిస్తాడో చూద్దాం....