ప్రధాని పదవి కావాలా నాయనా...!

 

ఉట్టికి ఎగరలేనమ్మ.. ఆకాశానికి ఎగురుతానందట. రాహుల్ గాంధీని చూస్తే ఇప్పుడు ఈ సామెతే గుర్తొస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే అలానే ఉన్నాయి మరీ. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. సొంత పార్టీ నేతలకే రాహుల్ గాంధీ సామర్థ్యంపై నమ్మకం లేదు. పార్టీకి రాహుల్‌ కారణంగా ఏమాత్రం ఉపయోగంలేదు. అందుకే పార్టీ పగ్గాలే రాహుల్ చేతికి అప్పగించాలంటే భయపడుతున్నారు. అలాంటి రాహుల్ గాంధీకి ఏకంగా ప్రధాని పదవే కావాలంట. ప్రధాని పదవికి పోటీ పడేందుకు నేను సిద్దం అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు. దీంతో ఇప్పుడు రాహుల్ వ్యాఖ్యలు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయి అని అనుకుంటున్నారు.

 

అంతేకాదు గతంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి చేయాలన్న వాదన వినిపించింది. కానీ సోనియా తెలుసుకదా... రాహుల్ గారి సామార్థ్యం... అందుకే రాహుల్ కు ఆ పదవి ఇవ్వడానికి వెనుకడుగు వేశారు. మరి అవకాశం ఉన్నప్పుడే రాహుల్ ప్రధాని కాలేకపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పుడప్పుడే అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు. ఇక దేశంలో బీజేపీ ముందెన్నడూ లేనంతగా బలపడిపోయాక, కాంగ్రెస్‌ పార్టీకి ఛాన్స్‌ ఇంకెక్కడుంది.? బీజేపీ బలపడటం ఒక ఎత్తు, కాంగ్రెస్‌ పార్టీ అత్యంత దారుణంగా బలహీనపడిపోవడం ఇంకో ఎత్తు. అలాంటిది ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని మంత్రికి పోటీ చేస్తాననడం జోక్ లా ఉందని అంటున్నారు. మరి ఇన్ని రోజులకు రాహల్ గాంధీకి ప్రధాన మంత్రి అవ్వాలని ఎందకు అనిపించిందో.. ? రాహల్ కోరిక ఎన్ని సంవత్సరాలకి తీరుతుందో చూద్దాం..