మొన్న రాహుల్.. ఇప్పుడు సోనియా వంతు...

 

మొన్నటి వరకూ రాహుల్ గాంధీ వంతు అయిపోయింది.. ఇప్పుడు సోనియా గాంధీ వంతు వచ్చేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పిపోయారంటూ ఆయన సొంత నియోజకవర్గం అమేథిలో పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ సొంత నియోజక వర్గమైన ఆమేథీకి రాహుల్  ఆరు నెలలుగా కన్నెత్తి కూడా చూడటం లేదని.. ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో ఆయన పోస్టర్లు అంటించారు. పోస్టర్లపై రాహుల్ గాంధీ ఫోటో... దాని కింద ‘‘ అమేథి ఎంపీని వెదికిపెట్టిన వారికి బహుమతి’’ అని ముద్రించారు. అయితే ఇప్పుడు సోనియా గాంధీ వంతు వచ్చింది. సోనియాగాంధీ కనబడటంలేదని ఆమె నియోజకవర్గం రాయ్ బరేలిలో పోస్టర్లు కలకలం సృష్టించాయి. గోరాబజార్, మహానందపూర్, ప్రభుత్వ కాలనీలో సోనియా ఆచూకీ కనుగొన్నవారికి రివార్డు ఇస్తామంటూ పోస్టర్లు కనిపించాయి. నియోజక వర్గం సమస్యలను సభలో ప్రస్తావించకపోవడం.. ఏడాదిగా నియోజక వర్గానికి రాకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు పోస్టర్లు వేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి తల్లీ, కొడుకుల మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టున్నారు.