TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేతే సంచలన వ్యాఖ్యలు..

Published on: Tue Mar 21, 2017 4:52PM

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేతే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ యువజన కాంగ్రెస్‌ నేత  సీఆర్‌ మహేష్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుండి పార్టీని నడిపించాలనే ఆసక్తి లేకపోతే రాహుల్‌ వెంటనే బాధ్యతల నుంచి వైదొలగాలని కోరారు. ‘రాహుల్‌ జీ.. మీరు కళ్లు తెరవాలి. దేశవ్యాప్తంగా బలమైన మూలాలున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఎలా ప్రజల మనస్సుల్లో నుంచి కనుమరుగవుతుందో చూడాలి’ అన్నారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయంలో ఇలా ఉండటం గర్హనీయమన్నారు.