గిన్నిస్ బుక్ లో రాహుల్ గాంధీ...!
Published on: Tue Mar 21, 2017 2:45PM
.jpg)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గిన్నిస్ బుక్ లో ఎక్కనున్నారు. విచిత్రంగా ఉంది కదా.. ఇంతకీ ఏం సాధించారని గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కనున్నారని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. మధ్యప్రదేశ్ కు చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న విశాల్ దివాన్ అనే ఓ విద్యార్థి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులకు వింతైన ప్రతిపాదన పంపాడు. అదేంటంటే.. గిన్నిస్ బుక్ కు దరఖాస్తు చేస్తూ, దేశంలో 27 ఎన్నికల్లో ఓటమిని చూసిన రాహుల్ గాంధీ పేరును గిన్నిస్ బుక్ కు ఎక్కించాలని కోరుతూ, అందుకు ఫీజు కూడా చెల్లించాడు. ప్రపంచంలో మరెవరూ ఇన్ని ఎన్నికల్లో ఓడిపోలేదని, ఎవరైనా ఓడివుంటే, ఆ విషయాన్ని తెలియజేయాలని, లేకుంటే రాహుల్ పేరు ఎక్కించాలని కోరాడు. ఇంకా ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే.. ఈ మేరకు అతని దరఖాస్తును స్వీకరిస్తున్నట్టు గిన్నిస్ బుక్ అధికారుల నుంచి కన్ఫర్మేషన్ రావడం. మరి చూడబోతే గిన్నిస్ బుక్ అధికారులు నిజంగానే రాహుల్ పేరును జాబితాలో పొందుపరిచేలా ఉన్నారు.


