సిద్దూ డిమాండ్లు రాహుల్ తీర్చేనా..?

 

త్వరలో పంజాబ్ లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకూ 40 స్థానాలకు అభ్యర్థులనే ప్రకటించలేదు. మరోవైపు బీజేపీ నుండి బయటకు వచ్చిన నవజోత్ సింగ్ సిద్దూ డిమాండ్లు ఎక్కువవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆయన డిమాండ్లను నెరవేరుస్తారా..? అన్న వాదన కూడా వినిపిస్తుంది. భాజపా నుంచి బయటకు వచ్చిన సిద్ధూ తొలుత సొంత పార్టీ అన్నారు. తర్వాత అది పార్టీ కాదు ఫ్రంట్‌ మాత్రమే అన్నారు. అసలు ఎన్నికల్లో పోటీ చేయదన్నారు. ఆ తర్వాత ఆప్‌లో చేరడానికి మంతనాలు సాగించారు. అది జరగలేదు. దాంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆయన భార్య ఆ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు సిద్ధూ చేరాలంటే కొన్ని డిమాండ్లు నెరవేర్చాలంటూ నెమ్మదిగా చిట్టా విప్పుతున్నారు. తనకూ భార్యకూ మాత్రమే కాక మరో నాలుగు సీట్లు తనవారికోసం కావాలని సిద్ధూ కోరుతున్నట్లు సమాచారం. అమృత్‌సర్‌ పార్లమెంట్‌ స్థానం కూడా కావాలంటున్నారు. దీంతో ఉన్న 40 సీట్లలో సిద్దూకే అన్ని సీట్లు ఇస్తే మిగిలిన కాంగ్రెస్ నేతల నుండి అసమ్మతి ఎదురవుతుందని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏం చేస్తారో.. సిద్దూ డిమాండ్లను రాహుల్ గాంధీ నెరవేర్చుతారో.. లేదో చూడాలి.