TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యథా రాహుల్.. తథా జగన్!

Published on: Mon Oct 28, 2013 7:04PM

 

rahul gandhi, jagan mohan reddy, ysrcongress, congress, jagan cm race, rahul pm race

 

 

కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడు జగన్‌ని మధ్య చాలా అంశాలలో పోలికలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

పోలిక-1.

రాహుల్ తండ్రి మాజీ ప్రధానమంత్రి. జగన్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరి తండ్రులూ కీర్తిశేషులే.  ఇద్దరూ తండ్రికి ఏకైక కుమారులే! రాహుల్, జగన్ ఇద్దరూ తమ తండ్రులు అధిష్టించిన పదవులను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నవారే.

పోలిక-2.

రాహుల్ని ప్రధానమంత్రి చేయాలని ఆయన తల్లి సోనియా పరితపిస్తుంటే, జగన్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తల్లి విజయమ్మ పరిశ్రమిస్తున్నారు.


పోలిక-3.

రాహుల్, జగన్.. ఇద్దర్నీ జనం మూడక్షరాల పేరుతోనే పిలుస్తారు. రాహుల్‌కి ‘యువరాజు’ అనే నిక్‌నేమ్ వుంది. జగన్‌కి ‘యువనేత’ అనే నిక్‌నేమ్ వుంది.


పోలిక-4.

అటు రాహుల్, ఇటు జగన్ ఇద్దరూ ఆవేశపరులుగా, దూకుడు కలిగి వున్నవాళ్ళుగా,  తనమాటే నెగ్గాలనే పట్టుదల ఉన్నవారిగా పేరు తెచ్చుకున్నారు.

పోలిక-5.

రాహుల్ గాంధీ కారణంగా దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జగన్ కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

పోలిక-6.

రాహుల్‌గాంధీలో, జగన్మోహన్‌రెడ్డిలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తుంది. ఇద్దరికీ చిన్న వయసులోనే పెద్ద కుర్చీ మీద కన్ను వుంది.

పోలిక-7.

రాహుల్‌కి, జగన్‌కి వేదికల మీద ఎలా మాట్లాడాలో తెలియదు. రాజస్థాన్ ఎన్నిక ప్రచారంలో నోటికొచ్చినట్టు మాట్లాడి రాహుల్ విమర్శలు ఎదుర్కుంటుంటే, సమైక్య శంఖారావంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి జగన్ ఇబ్బందులు తెచ్చుకున్నాడు.

పోలిక-8.

రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. అలాగే జగన్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎటుచూసినా కనిపించడం లేదు.