TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్ర మంత్రివర్గంలోకి అజిత్, చిరుకు డౌట్

Published on: Sat Dec 17, 2011 8:31AM

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ వ్యూహం మేరకు ఉత్తరప్రదేశ్‌లో తిరిగి కాంగ్రెసును బలోపేతం చేయడానికి అజిత్ సింగ్‌తో కాంగ్రెసు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది.కీలకమైన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ లోక్‌దళ్ నేత అజిత్ సింగ్‌తో కాంగ్రెసు అవగాహనకు వచ్చింది.ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గాన్ని ఆదివారంనాడు విస్తరించనున్నారు. ఈ విస్తరణలో కాంగ్రెసు కొత్త మిత్రుడు, ఆర్ఎల్‌డి నేత అజిత్ సింగ్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. ఆయనకు పౌర విమాన యానాల శాఖను కేటాయిస్తారు. అజిత్ సింగ్ కేంద్ర మంత్రి పదవిని చేపట్టడం ఇది నాలుగోసారి. రాష్ట్రంలో పశ్చిమాదిన ఆయన పార్టీ బలంగా ఉంది. లోకసభలో ఆర్‌ఎల్‌జి సభ్యులు ఐదుగురు ఉన్నారు. దీంతో లోకసభలో యుపిఎ బలం 272 నుంచి 277కు పెరిగింది.

కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని ఆర్ఎల్‌డి రాష్ట్రంలోని మొత్తం 403 సీట్లలో 45 శాసనసభ సీట్లకు పోటీ చేసే ఆలోచనలో ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిరంజీవికి ఇదే సమయంలో మంత్రి పదవి ఇస్తారా, లేదా అనేది సందేహంగానే ఉంది. తృణమూల్ కాంగ్రెసు, డిఎంకెల నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవి లభించవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, అజిత్ సింగ్‌తోనే మంత్రివర్గ విస్తరణను సరిపుచ్చవచ్చునని అంటున్నారు.