Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జూబ్లీ గెలుపు.. నవీన్ యాదవ్ కు రాహుల్ అభినందన
posted on: Nov 16, 2025 6:05AM
.webp)
ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నేపథ్యం లో ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేత రాహు ల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జూబ్లీ హి ల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నవీన్ యాదవ్ ను అభినందించారు. అలాగే వెల్ డన్ గుడ్ వర్క్ అంటూ సీఎం రేవంత్ నూ అభినందించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవ హారాలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై రాహుల్ తో కాంగ్రెస్ బృందం చర్చించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సాధించిన విజయంపై రాహుల్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బ లా న్ని మరింత పటిష్ఠం చేయడానికి తీ సుకోవాల్సిన చర్యలపై నాయకులకి రాహుల్ సూచనలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తు న్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, బలహీన ప్రాంతాల్లో పార్టీ బలోపేతం తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగిం చుకుని రేవంత్ బృందం శనివారం (నవంబర్ 15) రాత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది.






