హమారా బజాజ్.. పద్మభూషణ్ రాహుల్ బజాజ్ కన్నుమూత..
Published on: Sat Feb 12, 2022 3:56PM
తొలినాళ్లలో స్కూటర్ అంటే చేతక్ మాత్రమే. అప్పుడూ ఇప్పుడూ ఆటో అంటే బజాజ్ ఆటోనే. అలా, బజాజ్ బ్రాండ్‌ను దేశం గర్వించే దగిన సంస్థగా తీర్చిదిద్దిన ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ (83) కన్నుమూశారు. మహారాష్ట్రలోని పుణెలో ఆయన తుదిశ్వాస విడిచారు.
1965లో బజాజ్ గ్రూప్ బాధ్యతలను రాహుల్ బజాజ్ స్వీకరించారు. 2005లో ఛైర్మన్‌గా తప్పుకున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గానూ వైదొలిగారు. గౌరవ ఛైర్మన్‌గా మాత్రం కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు రాజీవ్ బజాజ్‌కు మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
2006 నుంచి 2010 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు రాహుల్ బజాజ్. ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది.


