కాపులకు రిజర్వేషన్.. ఏపీకి స్పెషల్ స్టేటస్.!!
Published on: Mon Jul 30, 2018 5:37PM
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్స్ ఏమున్నాయి అంటే టక్కున గుర్తొచ్చేవి కాపు రిజర్వేషన్, స్పెషల్ స్టేటస్.. ఇప్పుడు వీటి చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.. ఏపీలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ కూడా వీటినే అస్త్రాలుగా మలుచుకోవాలని చూస్తున్నట్టు ఉంది.. దీనికి నిదర్శనం ఆ పార్టీ నేతల మాటలే.

తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తూర్పుగోదావరి పర్యటనలో అక్కడి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కాపు సామాజిక వర్గం మనోభావాలతో ఆటలాడుకుంటున్నాయని మండిపడ్డారు.. కాంగ్రెస్ పార్టీ కాపుల రిజర్వేషన్లకై కట్టుబడి ఉందని స్పష్టం చేసిన రఘువీరా.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ సవరణ ద్వారా కాపు రిజర్వేషన్ల కల్పన సాధ్యమే అని తెలిపారు.. అలానే రాహుల్ గాంధీ ప్రధాని కాగానే మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే చేస్తారని అన్నారు.. రాహుల్ ప్రధాని అయిన 10 రోజుల్లోనే రాష్ట్రంలోని రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.


