నెటిజన్లను ఫిదా చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
Published on: Wed Aug 18, 2021 2:22PM
సినిమాల్లో బాలనటులను మించిన అందంతో మెరిసిపోతున్న ఈ అమ్మాయి ఫొటోలకు నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు. చాలా ముద్దుగా, బొద్దుగా ఉందని, మొహంలో తేజస్సు అద్భుతంగా ఉందని వారి హృదయస్పందనలు రాసేస్తున్నారు. ట్విట్టర్లో పెట్టిన వెంటనే చాలా మంది కామెంట్ల మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి గారాల మనవరాలు. పేరు సమైరా.

తన మనవరాలు సమైరాతో కలిసి పొలం దగ్గర దిగిన హై రిజల్యూషన్ పొటోలను రఘువీరారెడ్డి ట్విట్టర్లో షేర్ చేసి సమైరాను నెటిజన్లకు పరిచయం చేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగువెలిగిన రఘువీరా.. రాష్ట్రం విడిపోయాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్లుగా తన ఫాం హౌస్ కే పరిమితం అయ్యానని, రాష్ట్ర రాజకీయాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని, ఇలాంటి రాజకీయాల్లో కొనసాగడం కన్నా పొలం పనులు చేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోందని ఇటీవలే రఘువీరా మనసులో భావాలు పంచుకోవడం గమనార్హం. ఆయన వాలకం చూస్తే ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని ఆయన అభిమానులు, రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు.

మరి ఉన్నట్టుండి మనవరాలి ఫొటోను ఎందుకు షేర్ చేశాడన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. తన భావి వారసురాలిగా మనవరాలినే ప్రొజెక్ట్ చేస్తాడా అన్న ఛలోక్తులు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి అడపాదడపా సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని పలకరిస్తున్న రఘువీరా.. లేటెస్ట్ గా ఇలా మనవరాలి అందమైన ఫొటోలు పెట్టడంలో మాత్రం ఏదో భవిష్యత్ ఆలోచన ఉండే ఉంటుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.


