బాలకృష్ణ అందుకే కూర్చొని ఉంటారు..!

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీట్లో.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూర్చోవడంపై ఎంత దుమారం రేగుతుందో తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై పలు విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇక ఈ విమర్శలపై స్పందించిన అధికారులు.. ఆ మీటింగ్ లో బాలయ్య కూర్చున్నకుర్చీ సీఎంది కాదని, కేవలం ఆ స్థలంలో మాత్రమే ఆయన కూర్చున్నారని వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు దీనిపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కుర్చీని చంద్రబాబు లాక్కున్నారనే విషయం బాలకృష్ణ మనసులో ఉండి ఉంటుందని... అందుకే చంద్రబాబు రాష్ట్రంలో లేనప్పుడు ఆయన కుర్చీలో కూర్చున్నారని... ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఆ మోజు తీర్చుకున్నారని వ్యాఖ్యానించారు. కాగా అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో… హిందూపురం అభివృద్ధి, లేపాక్షి ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ  సమావేశంలో బాలకృష్ణతో పాటు పలువురు మంత్రులు, పలు శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.