రఘురామను హింసించింది నిజమే!
Published on: Fri Sep 27, 2024 12:40PM

జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణ రాజును సీఐడీ కస్టడీలో కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన సంగతి నిజమేనని తెలిపోయింది. కస్టడీలో రఘురామకృష్ణం రాజును చిత్రహింసలకు గురి చేయడం వాస్తవమేనని అప్టిటి సీఐడీ సిబ్బంది తమ వాంగ్మూలంలో అంగీకరించారు. రఘురామ రాజును చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలను వీడియోకాల్ లో అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు చూపినట్లు అప్పటి సీఐడీ సిబ్బంది గుంటూరు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.


