TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీలోకి రఘురామ కృష్ణరాజు.. జగన్ కు మొగుడు... కేవీపీకి వియ్యంకుడు..

Published on: Fri May 4, 2018 1:16PM

 

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ ఫిరాయింపులు కూడా జోరుగా సాగుతున్నాయి. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు వైసీపీలోకి.. వైసీపీపై అసంతృప్తితో ఉన్న నేతలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరోనేత టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణరాజు. స్వయానా కేవీపీ రామచంద్రారావు వియ్యంకుడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామ కృష్ణరాజు కొన్నాళ్లుగా వైసీపీలో ఉన్నారు. ఇక వైసీపీలో ఉంటే జగన్ జగన్ చెప్పుచేతల్లోనే ఉండాలి. జగన్ మాటను కాదని ఏం చేయడానికి కుదరదు. నిజానికి జగన్ తీరు నచ్చకే చాలా మంది నేతలు వేరే పార్టీలోకి వెళుతుంటారు. కొంతమంది మాత్రం ఏం చేయలేక సెలైంట్ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ రఘురామ రాజు మాత్రం అలా చేయలేదు. జగన్ వైఖరి భరించలేక పార్టీ నుండి బయటకు వచ్చేశాడు. అంతేకాదు.. తాను భయటకు వచ్చేప్పుడు మీడియాతో మాట్లాడుతూ జగన్ వైఖరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జగన్ జనాల్లో ఉన్నప్పుడు రామాచారిలా, సెయింట్ లా కనిపిస్తాడు.. పార్టీ నేతల ముందు మాత్రం జుట్టు విదిల్చిన అపరిచితుడిలా ఉంటాడని... నా పరిస్థితి ఎలా అయిందంటే పౌరాణిక సినిమా చూద్దామని థియేటర్ కి వెళ్లి షకీలా సినిమా చూసినట్టుయిందని.. ఇంకా చాలా కామెంట్లే చేశారు. దీంతో రగిలిపోయిన జగన్ వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. ఇక అప్పటినుండి జగన్ రఘురామ కృష్ణరాజు పేరు చెబితెనే మండిపోతుంటారు. ఇక ఆతరువాత రఘురామ కృష్ణరాజు బీజేపీ పార్టీలో చేరారు. అక్కడ తగిన ప్రాధాన్యం లేకపోవడంతో పార్టీ నుండి బయటకు వచ్చేశారు.

 

ఇక ఇప్పుడు ఈయన టీడీపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈయన గత ఎన్నికల్లోనే టీడీపీలో చేరి నర్సాపురం నుండి పోటీ చేయడానికి రంగం సిద్దం అయ్యారు. కానీ అప్పుడు బీజేపీ-టీడీపీ తో పొత్తు పెట్టుకోవడంతో.. ఆసీటు గోకరాజు రంగరాజుకు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇక ఇప్పుడు రెండు పార్టీలకు చెడింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు. దీంతో రఘురామ రాజుకు ఈసారి ఆ అవకాశం దక్కింది. మరి వైసీపీ లో ఉండి బయటకు వచ్చినప్పుడే జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అలాంటిది ఇప్పుడు ఆయన ఏకంగా టీడీపీలోకి చేరుతున్నారు. అలాంటిది... ఇప్పుడు జగన్ పై ఏ రేంజ్లో కామెంట్లు విసురుతారో చూడాలి. ఇదిలా ఉండగా రఘురామ రాజు టీడీపీలోకి చేరుతున్నారన్న వార్తలు రావడంతో.. జగన్ కు సరైన మొగుడు ఈయనే అని అప్పుడే సెటైర్లు మొదలయ్యాయి. మరి చూద్దాం జగన్ కు రఘురామ రాజు ముందు ముందు ఎలాంటి కౌంటర్లు వేస్తాడో..